Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద 5.232 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద 5.232 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

వార్త ముఖ్యాంశాలు

  • కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అక్టోబర్ 19: కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద రెబ్బెన పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.232 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
  • స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.70 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ వెల్లడించారు.
  • గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అక్టోబర్ 19: కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద రెబ్బెన పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.232 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.70 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ వెల్లడించారు. గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 353/2026గా NDPS చట్టంలోని 8(c) r/w 20(B)(ii)(A) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్టయిన వారిలో జుముర్ గెయిన్ (33), ఆమె భర్త సురంజన్ గెయిన్ (46) ఉన్నారు. వీరు ఈస్గాంలోని 11 నంబర్ ప్రాంతానికి చెందినవారు కాగా, ప్రస్తుతం కాగజ్‌నగర్‌లోని క్యూ.నెం.68లో నివసిస్తున్నారు. సురంజన్ గెయిన్ ఎస్‌పీఎం ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, జుముర్ గెయిన్ ఈ నెల 14న ఒడిశాకు వెళ్లి పింటూ అనే వ్యక్తి వద్ద రూ.15,000కు 5.232 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అనంతరం గంజాయితో కాగజ్‌నగర్‌కు తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఆమె మంచిర్యాల వైపు ప్రయాణిస్తుండగా, భర్త సురంజన్ గెయిన్ స్కూటీపై ఆమె కోసం వేచి ఉండి గంజాయిని స్వీకరించి తమ నివాసానికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద తనిఖీలు చేపట్టిన రెబ్బెన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభించింది. స్కూటీ నంబర్ TG20 A 1148తో పాటు రెండు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి సరఫరా వ్యవహారంలో ఒడిశాకు చెందిన పింటూ (A3), మంచిర్యాలకు చెందిన మున్నీ (A4), జైపూర్‌కు చెందిన చంద్రశేఖర్ (A5), రాజు (A6) తదితరుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరికి సరఫరా చేయాల్సి ఉంది, అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్న ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, ఇన్‌చార్జ్ వాంకిడి సీఐ వేణుగోపాల్, రెబ్బెన ఎస్‌ఐ వెంకటకృష్ణ, పోలీస్‌స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నితికా పంత్ అభినందించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *