వార్త ముఖ్యాంశాలు
- నగరంలోని ఎస్ఆర్ఎంటీ ప్రాంగణంలో ‘నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్’ (నారెడ్కో) కాకినాడ విభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ‘హోమ్ ఎక్స్పో’ ఘనంగా ముగిసింది.
- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు, సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఒకే వేదికపై సమగ్ర సమాచారం అందించే లక్ష్యంతో ఉచిత ప్రవేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభించింది.
- వేలాది మంది సందర్శకులు తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు.
నగరంలోని ఎస్ఆర్ఎంటీ ప్రాంగణంలో ‘నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్’ (నారెడ్కో) కాకినాడ విభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ‘హోమ్ ఎక్స్పో’ ఘనంగా ముగిసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు, సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఒకే వేదికపై సమగ్ర సమాచారం అందించే లక్ష్యంతో ఉచిత ప్రవేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. వేలాది మంది సందర్శకులు తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు.
ఈ ఎక్స్పోలో వ్యక్తిగత గృహాలు, అపార్ట్మెంట్లు, లేఅవుట్ డెవలపర్లతో పాటు ఇంటీరియర్స్, సిమెంట్, శానిటరీ, లిఫ్ట్లు, జనరేటర్లు, నర్సరీలు వంటి నిర్మాణ రంగానికి చెందిన విక్రేతలు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. కొనుగోలుదారులకు తక్షణ ఆర్థిక సాయం, గృహ రుణాలు అందించేందుకు ప్రముఖ బ్యాంకుల ప్రతినిధులు సైతం సేవలందించారు.
ముగింపు కార్యక్రమానికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ తలాటం సత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎక్స్పోను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ నిబంధనల సవరణలు నిర్మాణ రంగానికి ఎంతో మేలు చేస్తున్నాయని, బిల్డర్లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కుడా తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
నారెడ్కో కాకినాడ ప్రెసిడెంట్ పి.వి. వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. చాప్టర్ ఏర్పాటైన నాటి నుంచి బిల్డర్లు, డెవలపర్లు, విద్యార్థులకు ఉపయోగపడేలా పలు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని పేర్కొంటూ, సహకరించిన ఎస్ఆర్ఎంటీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం నారెడ్కో ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటోందని,కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద 16 అంతస్తులతో ‘ఆర్య ప్రాజెక్ట్స్’ వారి ‘అవాంటా’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారెడ్కో ప్రెసిడెంట్ పి. వి. వేణుగోపాలరావు ,సెక్రటరీ జనరల్ పి. పృథ్వీ రాజు ,సెక్రటరీ, ఎ.పి. స్టేట్
కె. ఉపేష్ ,జి.సి. మెంబర్ వి. నాగేశ్వరరావు , ఎ.పి.
ఎన్.శివరామకృష్ణ ప్రసాద్
సభ్యులు సూర్య భాస్కర్, నాగబాబు,ఎన్. వెంకట్,కె ఎం. సురేష్, ఇ. సతీష్ తదితరులు పాల్గొన్నారు.