Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం పదవులకై దరఖాస్తుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం పదవులకై దరఖాస్తుల ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ పదవులకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన ఎస్సి విభాగంలో పనిచేయడానికి ఆసక్తిగల నాయకులు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భువనగిరి పట్టణం లోని న్యూ వివేరా సమావేశ మందిరంలో దరఖాస్తులు అందజేయాలని ప్రభుత్వ…
  • ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ మందుల సూర్య కిరణ్, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ ఇతర ముఖ్య నాయకులతో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పైరవీలకు ఆస్కారం లేకుండా కష్టపడ్డాం కార్యకర్తలకు నాయకులకు పదవులు…
  • ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు అండ్ సంజీవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ కౌన్సిలర్ ఈరపాక నరసింహ, ఎజాజ్ , తదితరులు పాల్గొన్నారు...

యాదాద్రి భువనగిరి జిల్లా
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ పదవులకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన ఎస్సి విభాగంలో పనిచేయడానికి ఆసక్తిగల నాయకులు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భువనగిరి పట్టణం లోని న్యూ వివేరా సమావేశ మందిరంలో దరఖాస్తులు అందజేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బీర్ల ఐలయ్య గారు అన్నారు. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ మందుల సూర్య కిరణ్, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ ఇతర ముఖ్య నాయకులతో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పైరవీలకు ఆస్కారం లేకుండా కష్టపడ్డాం కార్యకర్తలకు నాయకులకు పదవులు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా దరఖాస్తులు స్వీకరించి పార్టీ పరిస్థితి తెలుసుకోవాలని ఉద్దేశంతో సంఘటన్ సృజన అభియాన్ కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారి సూచన మేరకు నిర్వహిస్తున్న రేపటి సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సి విభాగం నాయకులు కార్యకర్తలు ఆసక్తి గలవారు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు అండ్ సంజీవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ కౌన్సిలర్ ఈరపాక నరసింహ, ఎజాజ్ , తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *