Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

కాంగ్రెస్ పార్టీకి పెండెం కట్టయ్య సేవలు వెలకట్టలేనివి – కాంగ్రెస్ నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంగ్రెస్ పార్టీకి పెండెం కట్టయ్య సేవలు వెలకట్టలేనివి – కాంగ్రెస్ నేతలు

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట పట్టణంలో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు పెండెం కట్టయ్య 29వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
  • నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో..
  • ఆయన మనుమడు, తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ తో కలిసి కాంగ్రెస్ నాయకులు పెండెం కట్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

నర్సంపేట పట్టణంలో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు పెండెం కట్టయ్య 29వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఆయన మనుమడు, తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ తో కలిసి కాంగ్రెస్ నాయకులు పెండెం కట్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల సాంబరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, జిల్లా అధికార ప్రతినిధి ఎర్ర యాకూబ్ రెడ్డి మాట్లాడుతూ.. తుది శ్వాస వరకు నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ఉనికికి పెండెం కట్టయ్య చేసిన పోరాటాలు, సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, కౌన్సిలర్లు, వివిధ హోదాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

వార్తా మూలాలు

  • Whatsupపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *