ఖానాపురం పున్నమి ప్రతినిధి:
పెండింగ్లో ఉన్న 2 లక్షల దరఖాస్తులకు వెంటనే నిధులు విడుదల చేయాలి – బత్తిని శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా సుమారు 13 లక్షల మంది పేదింటి ఆడపడుచులకు ఆర్థిక చేయూత అందించామని బీఆర్ఎస్ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు, వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించకపోగా, రెండు లక్షలకు పైగా దరఖాస్తులను పెండింగ్లో ఉంచి పేద కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ అర్హులైన లబ్ధిదారులకు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
పెండింగ్ దరఖాస్తులన్నింటికీ వెంటనే నిధులు విడుదల చేయడంతో పాటు, ఎన్నికల హామీ ప్రకారం అర్హులైన మహిళలకు తులం బంగారం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
