Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కళాశాల టాపర్లకు వెండి నాణేల బహుమతూయను అందజేసీన కొట్టే సాయి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కళాశాల టాపర్లకు వెండి నాణేల బహుమతూయను అందజేసీన కొట్టే సాయి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 02, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగమల్లి కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
  • ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ చేతుల మీదుగా వివిధ రంగాల ప్రముఖులను వైభవంగా సత్కరించారు.
  • యోగా విభాగంలో జాతీయ అవార్డు గ్రహీత సుజాత, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యం, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ (క్రీడల) పోటీలలో స్వర్ణ పతకం సాధించిన కుమారి పత్తి నిత్య హాసినిలను దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 02, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగమల్లి కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ చేతుల మీదుగా వివిధ రంగాల ప్రముఖులను వైభవంగా సత్కరించారు. యోగా విభాగంలో జాతీయ అవార్డు గ్రహీత సుజాత, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యం, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ (క్రీడల) పోటీలలో స్వర్ణ పతకం సాధించిన కుమారి పత్తి నిత్య హాసినిలను దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో విభిన్న రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అవార్డులు సాధిస్తున్న శ్రీకాళహస్తి వాస్తవ్యులు ఈ ప్రాంతానికే ఎంతో గర్వకారణమని కొనియాడారు. విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విశిష్ట సన్మాన కార్యక్రమంలో విశ్రాంత జిల్లా ట్రెజరీ అధికారి వెంకట్ రామన్ స్వామినాథన్, బింగిమల్ల ప్రాజెక్ట్స్ ఎండి శైలేందర్ రెడ్డి, నాగమల్లి కృష్ణమూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు నాగమల్లి రాజశేఖర్, పద్మజ, ఖ్యాతి శ్రీ, ఆక్స్‌ఫర్డ్ వంశీ, చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ రూపదేవి, ఓపి భాగ్యలక్ష్మి, పూల కృష్ణమూర్తి, రామిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ, స్టేట్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ వెంకటేశ్వరరావు, జ్యోతిరావు మణి, రవికుమార్, లీలా కుమార్, రమేష్ బాబు, పూల సుబ్రహ్మణ్యం, అహ్మద్ భాషా, నారాయణ, మునిరత్నం, సురేష్ ముని, నవీన్, గోపి, చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *