Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలెక్టరేట్‌లో మరుగుదొడ్లకు తాళం.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలెక్టరేట్‌లో మరుగుదొడ్లకు తాళం.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ మరుగుదొడ్లు వినియోగానికి నోచుకోకుండా మూతపడ్డాయి.
  • నిర్వహణ సరిగా లేకపోవడంతో గత 15 రోజులుగా వాటికి తాళాలు వేసి ఉంచారు.
  • దీంతో వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

నెల్లూరు: నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ మరుగుదొడ్లు వినియోగానికి నోచుకోకుండా మూతపడ్డాయి. నిర్వహణ సరిగా లేకపోవడంతో గత 15 రోజులుగా వాటికి తాళాలు వేసి ఉంచారు. దీంతో వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరుగుదొడ్లు అందుబాటులో లేక ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన కలెక్టరేట్ ఆవరణలోనే మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *