Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలువాయ లో ఘనంగా వైయస్సార్ 17వ వర్ధంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
  • “వైఎస్సార్ అమర్ రహే..

నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. “వైఎస్సార్ అమర్ రహే.. జోహార్ వైఎస్సార్” అంటూ నాయకులు, కార్యకర్తలు చేసిన నినాదాలతో కలువాయి బస్టాండ్ ప్రాంగణం మారుమోగింది.

ఈ సందర్భంగా కలువాయి జడ్పీటీసీ సభ్యులు శ్రీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అందించిన సంక్షేమ పథకాల ఫలాలు నేటికీ ప్రతి ఇంటికీ అందుతున్నాయని పేర్కొన్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వైఎస్సార్ సంక్షేమ పాలన చెరగని ముద్ర వేసిందని అన్నారు.

వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఆర్. లక్ష్మీదేవి, మండల ఉప అధ్యక్షులు పంగా పెంచల నర్సారెడ్డి గారు,కలువాయి మాజీ సర్పంచ్ పెంచలమ్మతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *