వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్: ఓట్ల చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిని నిరసిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ…
- ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
- కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నిర్మల్: ఓట్ల చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిని నిరసిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.
ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేయనున్నట్లు తెలిపారు.
– వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు