Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

ఓటు హక్కు – సద్వినియోగ వాక్కు (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఓటు హక్కు – సద్వినియోగ వాక్కు (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • భారత ఎన్నికల కమీషన్ స్థాపనకు గుర్తుగా ఏటా జనవరి 25న మన దేశంలో "జాతీయ ఓటర్ల దినోత్సవం" జరుపుకుంటాము.
  • ఎన్నికల సమయంలో ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఓటుహక్కు ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం.
  • జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా పాఠకుల కోసం ...

భారత ఎన్నికల కమీషన్ స్థాపనకు గుర్తుగా ఏటా జనవరి 25న మన దేశంలో “జాతీయ ఓటర్ల దినోత్సవం” జరుపుకుంటాము. ఎన్నికల సమయంలో ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఓటుహక్కు ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా పాఠకుల కోసం … ఈ కవిత

నిర్ణీత వయస్సు వచ్చిన ప్రజలందరికి ఉన్న హక్కు ఓటు
ఉత్తమ నాయకుని ఎంపికతో పాటు
ఉత్తమ ప్రభుత్వ పరిపాలనకు రూటు … ఓటు
ఓటు విలున అమూల్యం
అందమైన పాలనకు వజ్రతుల్యం.
ఓటేయ్యడానికి నోటుకు ఆశ పడితే పొరపాటు
మందు కోసం ముందుకెలితే మతిపోటు
నాయకుని ఎంపికకు కాకూడదు రేటు
అనర్హులను గెలిపిస్తే బ్రతుకంతా చీకటి కాటు.
ఓటు నైతిక విలువల రూటైతే
పాలన ఎంతో స్వీటు.

*ఆలోచించు మిత్రమా..
ఓటరుగా నీ పయనం ఎటు?…*

ఓటుపై అవగాహన
సంక్షేమ సమాజాన ఆదరణ
నాయకత్యంపై జనసమోహ పరిశోధన
అర్హునికి ఓటు వేయడమే మన కర్తవ్య నిర్వహణ
వర్తమాన భవిష్యత్ తరానికి చెదరని అభినందన.
మంచి నాయకులను నాయకత్వాన్ని కోరుకుందాం
మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుందాం.
ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందాం

*జైహింద్*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *