వార్త ముఖ్యాంశాలు
- ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనామలిస్, నో మ్యాపింగ్ ఓటర్లుకు నోటీసుల జారీ, విచారణ అంశాలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- గురువారం ఐడిఓసి కార్యాలయంలో సర్ ప్రక్రియలో భాగంగా అనామలిస్, మ్యాపింగ్ కానీ ఓటర్లుకు నోటీసులు జారీ తదితర అంశాలపై తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, బూత్ సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనామలిస్, మ్యాపింగ్ కానీ ఓటర్లుకు గ్రామ పంచాయతీల వారీగా విడతలవారీ నోటీసులను జారీ చేయాలని సూచించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనామలిస్, నో మ్యాపింగ్ ఓటర్లుకు నోటీసుల జారీ, విచారణ అంశాలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలో సర్ ప్రక్రియలో భాగంగా అనామలిస్, మ్యాపింగ్ కానీ ఓటర్లుకు నోటీసులు జారీ తదితర అంశాలపై తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, బూత్ సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనామలిస్, మ్యాపింగ్ కానీ ఓటర్లుకు గ్రామ పంచాయతీల వారీగా విడతలవారీ నోటీసులను జారీ చేయాలని సూచించారు. నోటీసు అందజేసిన అనంతరం నిబంధనల ప్రకారం ఏడు రోజుల వ్యవధి ఇచ్చి విచారణ చేపట్టి, ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. నోటీసు తీసుకున్న వ్యక్తుల ఫోటో అప్ లోడ్ చేయాలని సూచించారు. ఎంపీడీఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, బీఎల్ఓలు పరస్పర సమన్వయంతో మండలాల వారీగా పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రక్రియను నాణ్యతతో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో నో మ్యాపింగ్, వ్యత్యాసాలకు సంబంధించిన ఓటర్లు సంఖ్య తక్కువగా ఉన్నదని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని అంశాన్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
నోటీసుల జారీ, విచారణ, పరిష్కార ప్రక్రియను ఈఆర్ఓ స్థాయిలో వేగవంతం చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి నోటీసుల జారీ, పరిష్కరించిన కేసులపై ప్రతిరోజూ పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో, పెండింగ్ లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అంతకు ముందు ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటి కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బూతు స్థాయి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.