Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం చేయాలి

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఓడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్‌ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతం అంతటా గాలింపు పరిధిని విస్తరించి, కోస్ట్‌గార్డ్‌, నేవీ, వైమానిక వనరులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలని కోరారు. మత్స్యకారుల ఆచూకీ కోసం మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక అధికారులతో అంతర్జాతీయ సమన్వయాన్ని మరింత పెంచాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు అన్ని అవకాశాలను వినియోగిస్తూ గాలింపు చర్యలను కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు. కుటుంబ సభ్యుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని శోధనను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే అన్ని సహాయక వ్యవస్థలను సమన్వయం చేసి, ప్రతి అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.

ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం చేయాలి

ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం చేయాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *