Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఏండ్ల నిరీక్షణకు ఫలితం పోతుగల్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏండ్ల నిరీక్షణకు ఫలితం పోతుగల్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు

రాజన్న సిరిసిల్ల జూలై 17 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ–శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన కుటుంబాలకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం కొత్త ఆశలను నింపిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సొంత ఇంటి కల సాకారం కానుందనే భావోద్వేగంతో ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అనమేని రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మామిండ్ల ఆంజనేయులు, మెరుగు కిరణ్ కుమార్, కేసుగాని చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ కొండని బాలకిషన్, వార్డు సభ్యుడు జంగ రాజు, ఎన్నారై జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తలారి నరసయ్య, పంచాయతీ కార్యదర్శి దేవరాజు, విద్యాధర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.

ఏండ్ల నిరీక్షణకు ఫలితం పోతుగల్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *