Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

సంక్షేమ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బత్తిని శ్రీనివాస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సంక్షేమ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బత్తిని శ్రీనివాస్

ఖానాపురం పున్నమి ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని 12 హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఏ మేరకు ఖర్చు చేశారు, ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరిందో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కోరారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేజీ టు పీజీ ఉచిత విద్య, విద్యార్హతల ఆధారంగా ప్రోత్సాహకాలు, యువతకు ఉద్యోగాలు, కార్పొరేషన్ల ఏర్పాటు, నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, ఉపాధి కల్పించాలని, అంత్యోదయ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బత్తిని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

సంక్షేమ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బత్తిని శ్రీనివాస్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *