Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు(పున్నమి ప్రతినిధి) ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కరట్లపల్లి.భవాని శంకర్ భువనగిరి జిల్లా కేంద్రంలోని బిసి కళాశాల హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో వారు కరపత్రం ఆవిష్కరించి.
  • ఆగస్టు 11,12,13వ తేదీల్లో భువనగిరిలో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ చదువుతు పోరాడు, చదువుపై పోరాడు నినాదంతో ముందుకెళ్తుందన్నారు.
  • విద్యార్థుల సమస్యలపై నికరంగా పోరాడుతున్న సంఘం ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న అతిపెద్ద సంఘమన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు(పున్నమి ప్రతినిధి)

ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కరట్లపల్లి.భవాని శంకర్
భువనగిరి జిల్లా కేంద్రంలోని బిసి కళాశాల హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో వారు కరపత్రం ఆవిష్కరించి.
ఆగస్టు 11,12,13వ తేదీల్లో భువనగిరిలో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ చదువుతు పోరాడు, చదువుపై పోరాడు నినాదంతో ముందుకెళ్తుందన్నారు. విద్యార్థుల సమస్యలపై నికరంగా పోరాడుతున్న సంఘం ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న అతిపెద్ద సంఘమన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకొచ్చిన బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణం చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నూతన విద్యా విధానం వల్ల విద్యను పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం జరుగుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చి 24 నెలలవుతున్నా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శిక్షనా తరగతులకు 300 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారన్నారు. 11వ తేదీన భువనగిరి ర్యాలీ ఉంటుందన్నారు. 12,13వ తేదీల్లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. తరగతులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమం రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హాస్టల్ కమిటీ కార్యదర్శి గోల్కొండ సతీష్, కమిటీ నాయకులు అరవింద, అభిషేక్,అభినవ్, శివ, మచ్చగిరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *