Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

ఎల్.బి.నగర్ శ్రీకాంత్ చారి చౌరస్తాలో వైభవంగా విశ్వకర్మ జయంతి.. స్వర్ణకార ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ మహోత్సవ ఊరేగింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎల్.బి.నగర్ శ్రీకాంత్ చారి చౌరస్తాలో వైభవంగా విశ్వకర్మ జయంతి.. స్వర్ణకార ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ మహోత్సవ ఊరేగింపు

ఎల్.బి.నగర్: విశ్వసృష్టికర్త శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ఎల్.బి.నగర్, మన్సూరాబాద్ స్వర్ణకార ఐక్య వేదిక ఆధ్వర్యంలో యజ్ఞ మహోత్సవ ఊరేగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్ చారి విగ్రహం చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఘనంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్–మన్సూరాబాద్ స్వర్ణకార ఐక్య వేదిక సభ్యులు మారోజు రమేష్ చారి, చిలుకూరి రామాచారి, బాణాగర్ వేణు గోపాల చారి, రాచకొండ సురేష్ కుమార్ చారి, ముమ్మడి శివ కుమార్ చారి, రాచకొండ శ్రీనివాస చారి, కృపాకర్ చారి, ఇటుకాల వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

ఎల్.బి.నగర్ శ్రీకాంత్ చారి చౌరస్తాలో వైభవంగా విశ్వకర్మ జయంతి.. స్వర్ణకార ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ మహోత్సవ ఊరేగింపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *