Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పోతవరంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి.
  • గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి .
  • అక్టోబర్ 13.

పి. గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి . అక్టోబర్ 13. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం పోతవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్ జిత్తుగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సహకారంతో ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈశిబిరంలో పి. గన్నవరం ప్రభుత్వ హోమియో వైధ్యులు నాగులాపల్లి శ్రీనివాస్ యాభై మంది రోగులను పరీక్షించి మందులను ఉచితముగా అందజేశారు.డా.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ నెలా రెండవ సోమవారం పోతవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఉదయం పది గంటలనుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుందని,ఈ అవకాశాన్ని పోతవరం గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించు కోవాలని తెలిపారు.ఈ శిబిరంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎమ్ లు ఈ శిబిరంలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *