Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎయిడ్స్ రహిత భవిష్యత్తు కోసం బీమాబాయి మహిళా మండలి విస్తృత ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎయిడ్స్ రహిత భవిష్యత్తు కోసం బీమాబాయి మహిళా మండలి విస్తృత ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద, మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం వద్ద బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు దిశ, కాకినాడ ఆదేశాలకు అనుగుణంగా విస్తృత ప్రచార కార్యక్రమం…
  • ఈ సందర్భంగా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ గురించి తెలియజేసే చిత్రాన్ని ప్రత్యేక వాహనంలో ఎల్ సి డి ప్రొజెక్టర్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు.
  • ఈ సందర్భంగా సాధికారత కలిగిన యువత, బలోపేతమైన సమాజాలు, ఎయిడ్స్ రహిత భవిష్యత్తు అనే అంశాలపై నినాదాలు చేశారు.హెచ్ఐవి ఏ విధంగా వ్యాపిస్తుంది,హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల సమాజంలో గల మూఢనమ్మకాలు,హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు మరియు అందుబాటులో ఉండే ఉచిత ప్రభుత్వ వైద్య…

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద, మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం వద్ద బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు దిశ, కాకినాడ ఆదేశాలకు అనుగుణంగా విస్తృత ప్రచార కార్యక్రమం 2026 ను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ గురించి తెలియజేసే చిత్రాన్ని ప్రత్యేక వాహనంలో ఎల్ సి డి ప్రొజెక్టర్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సాధికారత కలిగిన యువత, బలోపేతమైన సమాజాలు, ఎయిడ్స్ రహిత భవిష్యత్తు అనే అంశాలపై నినాదాలు చేశారు.హెచ్ఐవి ఏ విధంగా వ్యాపిస్తుంది,హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల సమాజంలో గల మూఢనమ్మకాలు,హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు మరియు అందుబాటులో ఉండే ఉచిత ప్రభుత్వ వైద్య సంస్థల సేవలు గురించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. హెచ్ఐవి స్థాయిని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీపై రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు, క్యూఆర్ కోడ్ ద్వారా హెచ్‌ఐవీ స్థాయి గురించి తెలుసుకునే సర్వేను స్థానికులతో చేయించారు. ఈ కార్యక్రమాల్లో కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వి ఏంజెలిన్,పబ్లిక్ హెల్త్ నర్స్ డివి సత్యనారాయణమ్మ,హెల్త్ సూపర్వైజర్ కే రాజగోపాల్,ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు,మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ రామకృష్ణ,స్టాఫ్ నర్స్ డి శివ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ ఎన్ రమాదేవి,డిప్యూటీ వార్డెన్ ఏ మహాలక్ష్మి, హిందీ టీచర్ ఎం సుకన్య, స్థానిక ప్రజలు,విద్యార్థులు,బీమాబాయి మహిళా మండలి ప్రోగ్రాం డాక్యుమెంటేషన్ కోఆర్డినేటర్ పి ఎస్ ఆర్ కనకాంబరం,మండల లెవెల్ ఇంప్లిమెంటర్లు జి రామయ్య శెట్టి,డి అర్జునరావు,కే శివశంకర్,కమ్యూనిటీ ఆర్గనైజర్లు వి అనితాకుమారి,ఆర్ సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *