వార్త ముఖ్యాంశాలు
- వింజమూరు,ఆగస్టు14, పున్నమి న్యూస్ ప్రతినిధి// జాతీయ రహదారి నుండి వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళు దారికి ఇరువైపుల ఎమ్యల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి సూచనలతో, టీడీపీ సీనియర్ నాయకులు గువ్వల కృష్ణా రెడ్డి దాతృత్వంతో 20 విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు.
- గత కొంతకాలంగా జాతీయ రహదారి నుండి ఈ మార్గంలో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలంటే రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- ఉదయగిరి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి ప్రజలు సమస్యను వివరించడంతో వెంటనే ఆయన స్పందించి వింజమూరు మండలం సీనియర్ నాయకులు గువ్వల కృష్ణా రెడ్డి ద్వారా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు.
వింజమూరు,ఆగస్టు14, పున్నమి న్యూస్ ప్రతినిధి//
జాతీయ రహదారి నుండి వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళు దారికి ఇరువైపుల ఎమ్యల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి సూచనలతో, టీడీపీ సీనియర్ నాయకులు గువ్వల కృష్ణా రెడ్డి దాతృత్వంతో 20 విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా జాతీయ రహదారి నుండి ఈ మార్గంలో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలంటే రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి ప్రజలు సమస్యను వివరించడంతో వెంటనే ఆయన స్పందించి వింజమూరు మండలం సీనియర్ నాయకులు గువ్వల కృష్ణా రెడ్డి ద్వారా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సమస్య పరిష్కారం కావడంతో, ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.