Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఓటర్ల జాబితాల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ…
  • ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి అనంతరం జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్

ఓటర్ల జాబితాల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి అనంతరం జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా రామచంద్రనాయక్ మాట్లాడుతూ SIR ప్రక్రియలో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగించబడుతున్నట్లు వస్తున్న నివేదికలపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఎన్నికల కమిషన్ పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం అవసరమైతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు భూక్య ఉమా మురళి నాయక్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *