Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఎద్దుగుట్ట మల్లన్న–ఎల్లమ్మ స్వామివారిని దర్శించిన తోట ఆగన్న, చక్రపాణి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎద్దుగుట్ట మల్లన్న–ఎల్లమ్మ స్వామివారిని దర్శించిన తోట ఆగన్న, చక్రపాణి

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామంలో నిర్వహించిన ఎద్దుగుట్ట మల్లన్న–ఎల్లమ్మ స్వామివారి కల్యాణ మహోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భక్తితో పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న, మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామంలో నిర్వహించిన ఎద్దుగుట్ట మల్లన్న–ఎల్లమ్మ స్వామివారి కల్యాణ మహోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భక్తితో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న, మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచందర్, భాగ్యలక్ష్మి సత్యనారాయణ, కళ్యాణి అశోక్ రావు, ధర్నాం అరుణ, ఎలుక వెంకన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిడ్డి శ్రీనివాస్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాంత ప్రజల సుఖసంతోషాలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు నాయకులకు స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *