Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఎట్టకేలకు సద్దుమణిగిన వివాదం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎట్టకేలకు సద్దుమణిగిన వివాదం!

ఖానాపురంపున్నమి ప్రతినిధి:
వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో తొలగిన ప్రతిష్టంభన
వరంగల్: వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు సోమవారం తెరపడింది. మార్కెట్ కార్యదర్శి, ఓ వ్యాపారి మధ్య తలెత్తిన వివాదం కారణంగా నిలిచిపోయిన కొనుగోళ్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమస్య పరిష్కారమై మార్కెట్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
నేటి నుంచి మార్కెట్‌లో యథావిధిగా వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు కొనసాగుతాయని జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఎట్టకేలకు సద్దుమణిగిన వివాదం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *