*వెంపటి సురేష్ జ్ఞాపకార్థ కూడిక – ఘన నివాళులు*
రెడ్డిగూడెం మండలం వెంపటిగూడెంలో టీడీపీ కుటుంబ సభ్యుడు వెంపటి సురేష్ మృతిచెంది 11వ రోజు సందర్భంగా జ్ఞాపకార్థ కూడిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.
పార్టీలో ప్రతి కార్యకర్తను తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తామని నాయకులు పేర్కొన్నారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగు యువత రెడ్డిగూడెం మాజీ మండల అధ్యక్షులు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు), టీడీపీ సీనియర్ నాయకులు ఉయ్యూరు రామ్మోహన్ రెడ్డి, దళిత నాయకులు మాతంగి రామారావు,మల్లాది బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

