Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఎంపిటిసి , జెడ్పీటీసీ ఎన్నికలకు పల్నాడు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లుసంయుక్త కలెక్టర్ సంజనా శ్రీహర్ష *28జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ ల కు ఎన్నికలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎంపిటిసి , జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు సంయుక్త కలెక్టర్ సంజనా శ్రీహర్ష 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ ల కు ఎన్నికలు

ఎంపిటిసి , జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు

సంయుక్త కలెక్టర్ సంజనా శ్రీహర్ష

28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ ల కు ఎన్నికలు

నరసరావుపేట, అక్టోబర్ 19

పల్నాడు జిల్లాలో ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధ మయ్యాయి. సోమవారం సాయంత్రం నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంజనా శ్రీహర్ష ఎన్నికల కార్యాచరణను వెల్లడించారు.
ఎంపీటీసీలకు మండలాల్లోని రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లు స్వీకరిస్తారని , జడ్పిటిసి లకు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ సంజనా శ్రీహర్ష స్వీకరిస్తారని తెలియజేశారు.
ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు 19.10.26 సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ లు అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. 24వ తేదీ స్క్రూట్ ని జరుగుతుందని , అందులో రిజెక్ట్ అయిన నామినేషన్లకు 25వ తేదీన అప్పీల్ కు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డిఓ ఆఫీసుల లోను, జడ్పిటిసి అభ్యర్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు . విత్ డ్రాయల్స్ మరియు ఫైనల్ కంటెస్ట్ ఇన్ క్యాండిడేట్స్ లిస్ట్ 27వ తేదీన ప్రకటించడం జరుగుతుందన్నారు. నవంబర్ మూడో తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, కౌంటింగ్ నవంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుండి జరుగుతుందని, ఫలితాలు కూడా కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలియజేశారు.

జిల్లాలోని 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 12,42,000 మంది ఓటు హక్కు వినియోగించుకో నున్నార ని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ల కోసం 1,548 పోలింగ్ కేంద్రాలు (706 హైపర్ సెన్సిటివ్, 488 సెన్సిటివ్) ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం ప్రతి మండల స్థాయిలో స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎంసీసీ టీమ్‌లను నియమించి, వారికి మెజిస్టీరియల్ అధికారాలు అప్పగించారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ద్వారా 24 గంటల పాటు తనిఖీలు కొనసాగు తున్నాయని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ సంజనా శ్రీహర్ష విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *