ఖానాపురం పున్నమి ప్రతినిధి:
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రిలో పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందికి సంబంధించిన సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆసుపత్రిలో నెల రోజులుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు సరైన వేతనాలు చెల్లించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నించేందుకు సిబ్బంది ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు స్పందించి, పెండింగ్ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
