Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

“ఉపాధ్యాయ వృత్తి… పవిత్రమైన వృత్తి”

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

*మరికల్‌లో ఘనంగా* *ఉపాధ్యాయుడు శ్రీ చెన్నయ్య పదవీ విరమణ మహోత్సవం*
*ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శానమోని నర్సింహులు*

*పున్నమి ప్రతినిధి నారాయణపేట తేదీ ::31/0 3/ 2026*

స్థానిక మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో సోమవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం)లో సుదీర్ఘ కాలం సేవలందించిన శ్రీ చెన్నయ్య గారి ఉద్యోగ విరమణ వీడ్కోలు సభ అత్యంత వైభవంగా జరిగింది.

విద్యా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న చెన్నయ్య గారిని మరియు వారి ధర్మపత్నిని సహచర ఉపాధ్యాయులు, సంఘ నాయకులు మరియు అధికారులు ఘనంగా సన్మానించారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం: శానమోని నరసింహులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (RUPP) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శానమోని నరసింహులు మాట్లాడుతూ.. సమాజ గమనాన్ని మార్చగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికే ఉందని అన్నారు. శ్రీ చెన్నయ్య గారు తన వృత్తి పట్ల చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకమని కొనియాడారు. ఆయన శేష జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా గడవాలని ఆకాంక్షించారు.

హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో RUPP సంఘం రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి శ్రీనివాస్ గారు, జిల్లా సంఘ బాధ్యులు రుద్రసముద్రం రాములు గారు, మరికల్ శ్రీనివాస్ గారు, భీంరెడ్డి గారు, రజిని గారు, ప్రముఖ కవి బాలస్వామి గారు, మునెమ్మ గారు, శ్రీనివాస్ గారు, శ్రీ కృష్ణయ్య గారు, నర్సింహులు గారు (ధన్వాడ), రాజు గారు తదితరులు పాల్గొన్నారు.

వక్తలు తమ ప్రసంగాలలో చెన్నయ్య గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. ఉపాధ్యాయులు, మిత్రులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

“ఉపాధ్యాయ వృత్తి… పవిత్రమైన వృత్తి”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *