Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది – చిట్వేల్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది – చిట్వేల్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే ముందడుగు వేసి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి దీపప్రజ్వలన చేశారు.
  • ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు మాట్లాడుతూ రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగానే కాక గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్తగా నిలిచారని, ఆయన జయంతినే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని వివరించారు.

చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే ముందడుగు వేసి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి దీపప్రజ్వలన చేశారు. ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు మాట్లాడుతూ రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగానే కాక గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్తగా నిలిచారని, ఆయన జయంతినే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని వివరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రంగారెడ్డి, డి.శ్రీనివాసులు, లీలావతి దేవి పాల్గొని విద్యార్థులను ప్రేరేపించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు పి.రాజశేఖర్, ఏ.శివన్నారాయణ, జి.శ్రీకాంతి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంపై ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *