
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ముందంజ
కాటారం, జులై 16, పున్నమి ప్రతినిధి: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రెండవ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపాధ్యాయ సంఘం నాయకులు నిర్వహించారు. మంగళవారం కాటారం మండల కేంద్రంలోని ధన్వాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో 38 మంది ఉపాధ్యాయులను పీఆర్టియు సంఘం సభ్యులుగా చేర్చుకున్నామని, కాటారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఏ రవీందర్, ఏ, తిరుపతి, తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజలో ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు ఎస్ సతీష్, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.