వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల:పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
- అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
- ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.
నంద్యాల:పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. బాబా ఫకృద్దీన్ మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న కూలి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయడంతో పాటు అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.