వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి ఏపీఎస్ఆర్టీసీ డిపో గ్యారేజీ ఆవరణలో ఉన్న చెట్లను వేళ్లతో సహా పెకళించి తీసుకెళ్లేందుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు.
- ఈ వేలంలో 16 టేకు చెట్లు, ఒక వేప చెట్టు, 27 తురకవేప చెట్లు, రెండు పెద్ద జమాయిల్ చెట్లు ఉన్నాయి.
- ఈ నెల 19వ తేదీ గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ఉదయగిరి ఆర్టీసీ డిపో ఆవరణలో వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉదయగిరి ఏపీఎస్ఆర్టీసీ డిపో గ్యారేజీ ఆవరణలో ఉన్న చెట్లను వేళ్లతో సహా పెకళించి తీసుకెళ్లేందుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు. ఈ వేలంలో 16 టేకు చెట్లు, ఒక వేప చెట్టు, 27 తురకవేప చెట్లు, రెండు పెద్ద జమాయిల్ చెట్లు ఉన్నాయి. ఈ నెల 19వ తేదీ గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ఉదయగిరి ఆర్టీసీ డిపో ఆవరణలో వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొని చెట్లను దక్కించుకోవాలని ఆయన కోరారు.