వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి భారీ బలం చేకూరింది.
- మాజీ ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి వర్గానికి చెందిన సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరాయి.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఉదయగిరి: నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి భారీ బలం చేకూరింది. మాజీ ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి వర్గానికి చెందిన సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు మూలే వినయ్ రెడ్డి తెలిపారు. నూతన సభ్యులకు సముచిత గౌరవం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ చేరికలతో ఉదయగిరిలో టీడీపీ మరింత బలోపేతమవుతుందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.