Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

ఇసుక దందా కోసం కొత్త ఊరునే సృష్టించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇసుక దందా కోసం కొత్త ఊరునే సృష్టించారు

వార్త ముఖ్యాంశాలు

  • మణుగూరు మండలంలో గుండ్ల సింగారం గ్రామం ఉందా లేని ఊరు పేరుతో అక్రమ ఇసుక రవాణా దందా దీని వెనుక ఏ రాజకీయ నాయకుని పాత్ర ఉంది పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్ 10-11-2025, మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుండ్ల సింగారం…
  • అయితే ఈ రోజు గుండ్ల సింగారం పేరుతో ఊరు లేని చోట ఊరి పేరు చెప్పుకొంటూ కొన్ని వేల క్యూబిక్ మీటర్ల భారీ యంత్రాలతో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు, అసలు దానికి టీ.జి.
  • ఎండిసి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది, 1996 అమైండ్మెంట్ యాక్ట్ 2011 పీసా చట్టం ప్రకారంగా ఆ గ్రామాన్ని సందర్శించారా, పీసా గ్రామ సభ పెట్టరా, కొన్ని అనుమానాలు కూడా మణుగూరు మండల ప్రజలకు వ్యక్తమవుతున్నాయి, ఇట్టి ఇసుక ర్యాంపు పై అధికారులు ఏ రకంగా గుడ్డిగా…

మణుగూరు మండలంలో గుండ్ల సింగారం గ్రామం ఉందా

లేని ఊరు పేరుతో అక్రమ ఇసుక రవాణా దందా

దీని వెనుక ఏ రాజకీయ నాయకుని పాత్ర ఉంది

పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్
10-11-2025, మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే యొక్క గ్రామం పేరుతో ఇసుక సొసైటీ లు చేసుకొని ఆదివాసీ సమాజాన్ని , ఏజన్సీ చట్టాలను మోసం చేస్తూ ఇసుక సొసైటీ లు ఎలా చేస్తున్నారు,దీని వెనుక కుట్ర దారులు, సూత్ర దారులు, కర్త, కర్మ, క్రియ ఏ సామాజిక వర్గానికి చెందినవారు,
దీనిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేయాలని మణుగూరు గ్రామవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు, మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే గ్రామం 20 సంవత్సరాల క్రితమే సింగరేణి ఓసి ల క్రింద తీసుకొని ల్యాండ్ లుసర్స్ క్రింద ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగిందని. అయితే ఈ రోజు గుండ్ల సింగారం పేరుతో ఊరు లేని చోట ఊరి పేరు చెప్పుకొంటూ కొన్ని వేల క్యూబిక్ మీటర్ల భారీ యంత్రాలతో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు, అసలు దానికి టీ.జి. ఎండిసి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది, 1996 అమైండ్మెంట్ యాక్ట్ 2011 పీసా చట్టం ప్రకారంగా ఆ గ్రామాన్ని సందర్శించారా, పీసా గ్రామ సభ పెట్టరా, కొన్ని అనుమానాలు కూడా మణుగూరు మండల ప్రజలకు వ్యక్తమవుతున్నాయి, ఇట్టి ఇసుక ర్యాంపు పై అధికారులు ఏ రకంగా గుడ్డిగా సంతకం పెట్టారు, మైనింగ్ , డి ఎల్ సి, ఎమ్మార్వో , ఇరిగేషన్ రకరకాల డిపార్ట్మెంట్ అధికారులు ఎలా సంతకాలు చేసి పర్మిషన్ లు ఇచ్చారు, గుండ్ల సింగారం ఊరు మాకు చూపించాలి అంటూ మణుగూరు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధికారులకు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *