వార్త ముఖ్యాంశాలు
- ఇరవెండి, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (VBG RAM G) పథకం కింద ఉపాధి హామీ పనులను గుర్తించేందుకు ఇరవెండి గ్రామపంచాయతీలో సోమవారం గ్రామసభ నిర్వహించారు.
- సర్పంచ్ గుండి బాబురావు అధ్యక్షతన జరిగిన సభలో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులపై చర్చించారు.
- ఈ సందర్భంగా 125 రోజుల పని హామీ, కనీస వేతనం రూ.300, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇరవెండి, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (VBG RAM G) పథకం కింద ఉపాధి హామీ పనులను గుర్తించేందుకు ఇరవెండి గ్రామపంచాయతీలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గుండి బాబురావు అధ్యక్షతన జరిగిన సభలో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా 125 రోజుల పని హామీ, కనీస వేతనం రూ.300, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో అవసరమైన చెరువు పూడికతీత, కుంటల నిర్మాణం, సీసీ రోడ్ల వంటి పనులను గుర్తించి లేబర్ బడ్జెట్లో చేర్చేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి స్పందన, ఏపీఎం, టీఏ, ఫీల్డ్ అసిస్టెంట్, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.