ఇబ్రహీంపట్నంలో జార ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం
ప్రారంభోత్సవంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జవహర్ గారితో కలిసి పాల్గొన్న జంపాల సీతారామయ్య గారు
ఇబ్రహీంపట్నం,
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో నూతనంగా జారా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీమంత్రి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జవహర్ గారితో కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య గారు పాల్గొన్నారు. జవహర్ గారితో కలిసి రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం జవహర్ గారిను మరియు జంపాల సీతారామయ్య గారికి స్వాగతం పలికారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించాలని.. వ్యాపారం దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు జంపాల సీతారామయ్య గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, జనసేన పార్టీ నాయకులు అక్కల రామ్మోహన్రావు (గాంధీ), స్థానిక నాయకులు పాల్గొన్నారు.

