Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబ్ నగర్

ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహణ చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

*ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 24/0 4/2026*

*రాష్ట్రంలోని నాన్-టెట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, టెట్ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయాలని* *కోరుతూ రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్ యూపీపీ) ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నరసింహులు, ప్రధాన సలహాదారు గోపాల్ జి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ సూచనల మేరకు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, నాన్-టెట్ టీచర్స్ కన్వీనర్ ఎండి. అమీర్ పాషా ఢిల్లీలో కేంద్రమంత్రికి విజ్థప్తి చేశారు. ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు, టెట్ మినహాయింపు లేదా సవరణ అంశాలపై స్పందించిన కేంద్ర మంత్రి, దీనికి సంబంధించిన ఫైల్‌ను తక్షణమే విద్యాశాఖ* *ఉన్నతాధికారులకు పంపించి, సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు*.
*ఈ సందర్భంగా అమీర్ పాషా మాట్లాడుతూ*, *ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలన్న ఆలోచన స్వాగతించదగినదని పేర్కొన్నారు. అయితే, ఈ* *పరీక్షలో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు కనీస అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించాలని కోరారు*.

ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహణ చేయాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *