Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

ఇందిరమ్మ చెరువు కాలుష్యం, రోడ్డు సమస్యపై స్పందించాలి ​మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్లు రమేష్, హరి గౌడ్ వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇందిరమ్మ చెరువు కాలుష్యం, రోడ్డు సమస్యపై స్పందించాలి ​మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్లు రమేష్, హరి గౌడ్ వినతి

వార్త ముఖ్యాంశాలు

  • మేడ్చల్ జిల్లా (పున్నమి విలేకరి సందీప్): దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని తీవ్రమైన ప్రజా సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో 13వ వార్డు మాజీ కౌన్సిలర్ రమేష్, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ హరి గౌడ్‌లు మేడ్చల్…
  • ​ఈ సందర్భంగా దమ్మాయిగూడలోని ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
  • ముఖ్యంగా డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న విషపూరిత 'లిచేట్' నీరు ఇందిరమ్మ చెరువులోకి కలవడం వల్ల చెరువు నీరంతా కలుషితమై తీవ్ర దుర్గంధం వెలువడుతోందని, దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.

మేడ్చల్ జిల్లా (పున్నమి విలేకరి సందీప్):
దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని తీవ్రమైన ప్రజా సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో 13వ వార్డు మాజీ కౌన్సిలర్ రమేష్, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ హరి గౌడ్‌లు మేడ్చల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.
​ఈ సందర్భంగా దమ్మాయిగూడలోని ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న విషపూరిత ‘లిచేట్’ నీరు ఇందిరమ్మ చెరువులోకి కలవడం వల్ల చెరువు నీరంతా కలుషితమై తీవ్ర దుర్గంధం వెలువడుతోందని, దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే ఇందిరమ్మ చెరువు కింద ఉన్న రహదారి నేటికీ రోడ్డు నిర్మాణం కాకపోవడంతో బాటసారులు, వాహనదారులు పడుతున్న అవస్థలను మంత్రికి వివరించి, వెంటనే నిధులు మంజూరు చేసి సమస్యలను తీర్చాలని కోరారు.
​దమ్మాయిగూడ అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి అనునిత్యం పోరాడుతామని మాజీ కౌన్సిలర్లు రమేష్, హరి గౌడ్ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *