వార్త ముఖ్యాంశాలు
- గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ రాజారత్నం బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు-3 టౌన్ సీఐ రామాంజనేయుడును మరోసారి కలిసి ప్రొద్దుటూరు హౌసింగ్ స్కాంపై పూర్తి వివరాలను అందించారు.
- ప్రొద్దుటూరు హౌసింగ్ గోడౌన్లలో మాయమైన రూ.1.70 కోట్ల విలువైన ఐరన్ వివరాల రికార్డులు ఇచ్చారు.
- ఇందుకు బాధ్యులైన అనుమానితులపై పిర్యాదు చేశారు.
గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ రాజారత్నం బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు-3 టౌన్ సీఐ రామాంజనేయుడును మరోసారి కలిసి ప్రొద్దుటూరు హౌసింగ్ స్కాంపై పూర్తి వివరాలను అందించారు. ప్రొద్దుటూరు హౌసింగ్ గోడౌన్లలో మాయమైన రూ.1.70 కోట్ల విలువైన ఐరన్ వివరాల రికార్డులు ఇచ్చారు. ఇందుకు బాధ్యులైన అనుమానితులపై పిర్యాదు చేశారు. AE సుబ్రమణ్యంతో పాటూ, EE రాజశేఖర్, WI ప్రతాప్ రెడ్డి పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.