వార్త ముఖ్యాంశాలు
- ఆ...నాటి నెల్లూరు మహనీయులు పొట్టి శ్రీరాములు - రాష్ట్ర సాధన గాంధేయవాదాన్ని ఆయుధంగా చేసుకొని ప్రత్యేకరాష్ట్రం కొరకు నిరసన దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టిశ్రీరాములు.
- వీరు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు.
- వీరు జన్మించింది మద్రాసులో అయినా, స్వగ్రామము బోగోలు మండలంలోని జువ్వల దిన్నె.
పొట్టి శ్రీరాములు – రాష్ట్ర సాధన
హరిజన దేవాలయ ప్రవేశం కొరకు నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో దీక్ష చేపట్టారు. 23 రోజుల తర్వాత దేవాలయ మేనేజ్ మెంట్ దిగివచ్చి హరిజనులకు ప్రవేశం కల్పించింది. మొదట పట్టించుకోక పోయినా అప్పటి మద్రాసు ప్రభుత్వం స్పందించింది. పొట్టి శ్రీరాములు పేరు వింటేనే దీక్షలు గుర్తుకొచ్చే విధంగా ఆయన పేరు మార్మోగిపోయింది. అప్పట్లో ఆంధ్రప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. తమిళులు తెలుగువారిపై చిన్నచూపు చూసేవారు. ఆంధ్రప్రాంతం విడివడాలని కొంతకాలం నుండి ఉద్యమాలు సాగుతుండేవి. అది తీవ్రమై రాష్ట్రసాధన కొరకు దీక్షచేపట్టడానికి శ్రీరాములు సిద్ధపడ్డారు. మద్రాసు నగరం నడిబొడ్డున తెలుగువాడైన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి ఇంట్లో శ్రీరాములు ఆమరణదీక్ష ప్రారంభించారు. 58రోజులు నిరాహారదీక్షచేసి 1952 డిసెంబరు 15న శ్రీరాములు మరణించడంతో రాష్ట్రం అగ్నిగుండమైంది. అల్లర్లు వ్యాపించాయి. కాల్పులు జరిగాయి. నెల్లూరులో నలుగురు అమాయకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. కేంద్రప్రభుత్వం స్పందించింది. ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటన చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత తెలిపారు.
జిల్లాలో స్త్రీ విద్యకు నాంది
ఆమె కోరిక మేరకు పల్లెపాడులో పినాకినీ సత్యాగ్రహాశ్రమాన్ని గాంధీజీ 1921లో ప్రారంభించారు. దానికవసరమైన 13 ఎకరాల స్థలాన్ని కనకమ్మ కొని ఇచ్చారు. దీనికి ‘దక్షిణాది సబర్మతి’ ఆశ్రమంగా పేరుంది (పల్లెపాడు ఇందుకూరుపేట మండలంలోని గ్రామం). కనకమ్మ వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు జరిపించారు. విధి వంచితలైన స్త్రీల అభ్యున్నతికొరకు 1952లో పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మరుపూరివారి ఇంట పుట్టింది – పొణకా వారి ఇంటి కోడలుగా వచ్చింది. రెండు కుటుంబాలకు పేరు ప్రతిష్ఠలు తెచ్చింది. ‘ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తారు’ అని చెప్పిన గురజాడవారి మాటలను కనకమ్మ నిరూపించింది. ఆమె తమ్ముడు మరుపూరు కోదండరామిరెడ్డి ‘మందాకిని’ పత్రిక నడిపిన ప్రముఖ సాహితీవేత్త. కనకమ్మ మరణించి (1963) అర్ధశతాబ్దం దాటుతున్నా నెల్లూరు నగరంలోగాని, కస్తూరిదేవి విద్యాలయంలో గాని ఆమె విగ్రహప్రతిష్ఠ నేటికీ జరగకపోవడం విచారకరం.ఆమె స్థాపించిన విద్యాలయం, పల్లెపాడు ఆశ్రమం, నెల్లూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయి. నేడు ఈ ప్రాంతపు ఆడపిల్లలు చదువుల్లో ముందడుగులో ఉండడానికి కారణం ఆనాడు కనకమ్మ వేసిన పునాది. స్త్రీల ప్రగతికి విద్య మౌలికావసరంగా ఆమె ఆ రోజుల్లోనే గుర్తించి ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు.
నెల్లూరు పురమందిర నిర్మాత రేబాల లక్ష్మీనర్సారెడ్డి
ఇప్పుడా పురమందిరం స్థలం కోట్లకుకోట్లు విలువ చేస్తుంది.