Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

ఆసిఫాబాద్‌లో రాజస్థానీ హోటల్‌లో చోరీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆసిఫాబాద్‌లో రాజస్థానీ హోటల్‌లో చోరీ

వార్త ముఖ్యాంశాలు

  • తేదీ: 19-08-2026 | ఆసిఫాబాద్(పున్నమి ప్రతినిధి) ఆసిఫాబాద్ పట్టణంలో బుధవారం ఓ రాజస్థానీ హోటల్‌లో అజ్ఞాత దొంగలు చోరీకి పాల్పడ్డారు.
  • హోటల్ వెనుక భాగంలో ఉన్న కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదును అపహరించి పరారైనట్లు హోటల్ యజమాని తెలిపారు.
  • హోటల్ యజమాని నారాయణ్ లాల్ దేవాసీ తెలిపిన వివరాల ప్రకారం..

తేదీ: 19-08-2026 | ఆసిఫాబాద్(పున్నమి ప్రతినిధి)
ఆసిఫాబాద్ పట్టణంలో బుధవారం ఓ రాజస్థానీ హోటల్‌లో అజ్ఞాత దొంగలు చోరీకి పాల్పడ్డారు. హోటల్ వెనుక భాగంలో ఉన్న కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదును అపహరించి పరారైనట్లు హోటల్ యజమాని తెలిపారు.

హోటల్ యజమాని నారాయణ్ లాల్ దేవాసీ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు హోటల్‌లోని సుమారు రూ.10,000 నగదును తీసుకెళ్లారు. ఇదే హోటల్‌లో గతంలో కూడా రెండు, మూడు సార్లు చోరీలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

వరుసగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో హోటల్ యజమానులు, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో భద్రతా చర్యలు మరింత పెంచాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు.

చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *