Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఆశ్రమ అభివృద్ధికి శ్రీ రామచంద్రయ్య గురువు గారి విశేష కృషి ప్రతి పౌర్ణమి భగవద్గీత పారాయణం – కుటుంబ సభ్యుల నివాళి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆశ్రమ అభివృద్ధికి శ్రీ రామచంద్రయ్య గురువు గారి విశేష కృషి ప్రతి పౌర్ణమి భగవద్గీత పారాయణం – కుటుంబ సభ్యుల నివాళి

వార్త ముఖ్యాంశాలు

  • అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండల పరిధిలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ దతగిరి నారాయణ తపోవన ఆశ్రమ అభివృద్ధి కోసం గురువు శ్రీ రామచంద్రయ్య గారు చేసిన కృషి అపారమని ఆయన కుటుంబ సభ్యులు స్మరించారు.
  • ఆశ్రమ నిర్మాణం, విస్తరణ, భక్తుల సౌకర్యాల కోసం అహర్నిశలు శ్రమించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడంలో గురువు గారి పాత్ర అపూర్వమని వారు తెలిపారు.
  • ప్రత్యేకంగా ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తుల సమక్షంలో భగవద్గీత పారాయణం నిర్వహించడం ఆయన జీవితంలో ఒక శాశ్వత సంప్రదాయమని గుర్తుచేశారు.

అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండల పరిధిలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ దతగిరి నారాయణ తపోవన ఆశ్రమ అభివృద్ధి కోసం గురువు శ్రీ రామచంద్రయ్య గారు చేసిన కృషి అపారమని ఆయన కుటుంబ సభ్యులు స్మరించారు. ఆశ్రమ నిర్మాణం, విస్తరణ, భక్తుల సౌకర్యాల కోసం అహర్నిశలు శ్రమించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడంలో గురువు గారి పాత్ర అపూర్వమని వారు తెలిపారు. ప్రత్యేకంగా ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తుల సమక్షంలో భగవద్గీత పారాయణం నిర్వహించడం ఆయన జీవితంలో ఒక శాశ్వత సంప్రదాయమని గుర్తుచేశారు. భగవద్భక్తి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో నాటడమే లక్ష్యంగా ఆయన వ్యవహరించారని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ కలతితం చెందని మనసుతో భగవద్గీత బోధనలను ఆచరణలో చూపిన గురువు గారి త్యాగం, సేవా భావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆశ్రమాన్ని ఆధ్యాత్మిక కేంద్రముగా తీర్చిదిద్దడంలో గురువు గారి కృషి ఎప్పటికీ మరువలేనిదని వారు నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *