వార్త ముఖ్యాంశాలు
- పి.
- గన్నవరం: పి.
- గన్నవరం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఎ.పి.
పి. గన్నవరం: పి. గన్నవరం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఎ.పి. ఆశా వర్కర్స్ యూనియన్ (CITU) ప్రతినిధులు ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ ని కలిసి తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
అఖిల భారత ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపులో భాగంగా అక్టోబర్ 6న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మాస్ రిప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆశా వర్కర్లు తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, భత్యాలు కల్పించాలని కోరారు.
అలాగే 2026 మార్చి 5న ప్రభుత్వం–ఆశా వర్కర్ల మధ్య జరిగిన చర్చల ఒప్పందం మేరకు సంబంధిత జీవోలు, సర్క్యులర్లు వెంటనే జారీ చేయాలని, ఆశా డే సందర్భంగా ఈ నెలలోనే మరోసారి ప్రభుత్వం చర్చలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎ.పి. ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, ఆశా వర్కర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.