Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

ఆర్‌ఏఆర్‌ఎస్ పరిరక్షణకు ఉధృతమైన పోస్టుకార్డు ఉద్యమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆర్‌ఏఆర్‌ఎస్ పరిరక్షణకు ఉధృతమైన పోస్టుకార్డు ఉద్యమం

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: ఆర్‌ఏఆర్‌ఎస్‌ (ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం) నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను వెంటనే తరలించాలని, నూనెపల్లె మార్కెట్‌యార్డులో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా శుక్రవారం గిరినాథ్ సెంటర్‌లో…
  • ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కలెక్టరేట్ వల్ల పరిశోధనలకు విఘాతం కలుగుతోందని ఐక్యవేదిక అధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
  • ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు జానయ్య, మహేశ్వర్‌రెడ్డి, శంకరయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల: ఆర్‌ఏఆర్‌ఎస్‌ (ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం) నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను వెంటనే తరలించాలని, నూనెపల్లె మార్కెట్‌యార్డులో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా శుక్రవారం గిరినాథ్ సెంటర్‌లో నిర్వహించిన రెండో విడత కార్యక్రమంలో ప్రజలు పోస్టుకార్డులపై తమ డిమాండ్లను రాసి ప్రభుత్వానికి పంపించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కలెక్టరేట్ వల్ల పరిశోధనలకు విఘాతం కలుగుతోందని ఐక్యవేదిక అధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు జానయ్య, మహేశ్వర్‌రెడ్డి, శంకరయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *