వార్త ముఖ్యాంశాలు
- పున్నమి న్యూస్: హైదరాబాద్, 17 ఆగస్టు 2026: తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులు, విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది.
- ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- తమ సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని భావించిన ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు టిమ్స్ మెడికల్ హాస్పిటల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పున్నమి న్యూస్: హైదరాబాద్, 17 ఆగస్టు 2026: తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులు, విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని భావించిన ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు టిమ్స్ మెడికల్ హాస్పిటల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు, యువ వైద్యులు అక్కడే శాంతియుతంగా నిరసన తెలిపారు. “ముఖ్యమంత్రి రావాలి.. మా సమస్యలు వినాలి.. న్యాయం చేయాలి” అంటూ నినాదాలు చేశారు. తమ గొంతు ప్రభుత్వానికి వినిపించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆయుష్ వైద్యుల సమస్యకు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు మద్దతు ప్రకటించారు. శ్రీ ఈటల రాజేందర్, శ్రీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఏయూష్ వైద్యుల న్యాయమైన డిమాండ్‌కు మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.
“ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మా సమస్యను స్వయంగా వినాలి. మేము కోరేది ఘర్షణ కాదు — పరిష్కారం. ప్రత్యేక హక్కులు కాదు — సమానత్వం. హామీలు కాదు — న్యాయం” అని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.