Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

ఆపరేషన్ వజ్రప్రహార్’ గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆపరేషన్ వజ్రప్రహార్’ గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

పలమనేరులో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’

గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

పలమనేరు, అక్టోబర్ 09 ( పున్నమి ప్రతినిధి ) :
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా పలమనేరు సబ్-డివిజన్ పరిధిలోని గంటఊరు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా ‘కార్డన్ & సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు. ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కార్యక్రమంలో భాగంగా పలమనేరు అర్బన్ సీఐ కె. మోహన్ రెడ్డి, గంగవరం సీఐ రామ్ భూపాల్, పలమనేరు రూరల్ సీఐ పరశురామ్, అర్బన్ ఎస్ఐ కె. రాజశేఖర్ ఆధ్వర్యంలో 54 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కాలనీలోని దాదాపు 250 ఇళ్లను అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే 100 ద్విచక్ర వాహనాలు, 10 ఆటో రిక్షాల పత్రాలను పరిశీలించారు. ఈగల్ టీమ్ సహకారంతో డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా 13 మంది అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి మాదకద్రవ్యాలు, మద్యం గానీ, ఇతర నిషేధిత వస్తువులు గానీ లభించలేదని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు సబ్-డివిజన్ వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Uploaded Video:

ఆపరేషన్ వజ్రప్రహార్’ గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్’ గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్’ గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్’ గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్’ గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్’ గంటఊరు,ఇందిరమ్మ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *