Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఆనందపురం 1 ఎంపీటీసీ బరిలో జనసేన వీర మహిళ కుప్పా రామలక్ష్మి సేవా కార్యక్రమాలే బలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆనందపురం 1 ఎంపీటీసీ బరిలో జనసేన వీర మహిళ కుప్పా రామలక్ష్మి సేవా కార్యక్రమాలే బలం

జై జవాన్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎనిమిదేళ్లుగా సేవలు.. 420 క్రియాశీలక సభ్యత్వాలతో మండలంలో ప్రథమ స్థానం

విశాఖపట్నం జిల్లా,ఆనందపురం (పున్నమి ప్రతినిధి): అక్టోబర్ 22: ఆనందపురం-1 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా కుప్ప రామలక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు. జై జవాన్‌ ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎనిమిదేళ్లుగా జనసేన పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న ఆమె స్థానికంగా గుర్తింపు పొందారు.

వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, నేత్ర వైద్య శిబిరాల నిర్వహణతో పాటు అనాథ పిల్లలు, వృద్ధులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, చదువుకు ఆర్థిక సాయం, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు చేయూత అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదులో 420 సభ్యత్వాలు చేయించి ఆనందపురం మండలంలో ప్రథమ స్థానం, భీమిలి నియోజకవర్గంలో ఐదో స్థానం సాధించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సందీప్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

రామలక్ష్మి నామినేషన్‌ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరయ్యారు. కూటమి తరఫున బీఫారం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు, పార్టీ పట్ల చురుకైన పాత్ర నేపథ్యంలో ఆనందపురం-1 ఎంపీటీసీ స్థానంలో ఆమె అభ్యర్థిత్వంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

ఆనందపురం 1 ఎంపీటీసీ బరిలో జనసేన వీర మహిళ కుప్పా రామలక్ష్మి సేవా కార్యక్రమాలే బలం

ఆనందపురం 1 ఎంపీటీసీ బరిలో జనసేన వీర మహిళ కుప్పా రామలక్ష్మి సేవా కార్యక్రమాలే బలం

ఆనందపురం 1 ఎంపీటీసీ బరిలో జనసేన వీర మహిళ కుప్పా రామలక్ష్మి సేవా కార్యక్రమాలే బలం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *