Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు యూపీహెచ్‌సీలో సేవా సంకల్ప అభియాన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరు యూపీహెచ్‌సీలో సేవా సంకల్ప అభియాన్

వార్త ముఖ్యాంశాలు

  • ఉచిత వైద్య పరీక్షలు..
  • ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ఆత్మకూరు, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) : ఆత్మకూరు పట్టణంలోని అరుంధతివాడ పరిధిలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని డాక్టర్ సాయి ప్రసన్న ఆధ్వర్యంలో బుధవారం విజయవంతంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు, అవసరమైన చికిత్సలు అందించారు.గర్భిణీలకు ప్రసవానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించి, అధిక ప్రమాద గర్భిణీలను గుర్తించారు.

ఉచిత వైద్య పరీక్షలు.. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు

ఆత్మకూరు, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) : ఆత్మకూరు పట్టణంలోని అరుంధతివాడ పరిధిలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని డాక్టర్ సాయి ప్రసన్న ఆధ్వర్యంలో బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు, అవసరమైన చికిత్సలు అందించారు.గర్భిణీలకు ప్రసవానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించి, అధిక ప్రమాద గర్భిణీలను గుర్తించారు. హిమోగ్లోబిన్, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై కౌన్సెలింగ్‌ అందించడంతో పాటు తక్కువ ఉప్పు, తక్కువ నూనె, తక్కువ చక్కెరతో కూడిన ఆహారం తీసుకోవడంపై అవగాహన కల్పించారు.అదేవిధంగా టెలి-మానస్ మానసిక ఆరోగ్య సేవలు, కిశోర బాలికలకు మాసిక పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. డాక్టర్ అబ్దుల్ రజాక్ ప్రజలకు వైద్య సేవలు అందించి, పరీక్షల అనంతరం అవసరమైన వారికి చికిత్స, ఆరోగ్య సూచనలు ఇచ్చారు.కార్యక్రమంలో ఆరోగ్య విద్యా అధికారి ఎస్. సుధాకర్, ఆరోగ్య పర్యవేక్షకురాలు పార్వతి, ఆరోగ్య సహాయకుడు శ్రీరాములు, యూపీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు వారి పరిధిలోనే ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వైద్య సిబ్బంది తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *