Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాల హవా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాల హవా

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 24 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టంలోనే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి.
  • నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నియోజకవర్గ పరిధిలో మొత్తం 135 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో దాదాపు 48 పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
  • ఈ లెక్కన సుమారు 40 శాతం పంచాయతీల్లో పోలింగ్‌కు ముందే ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లయింది.మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఏకగ్రీవాలు నమోదు కావడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆత్మకూరు, నవంబర్ 24 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టంలోనే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నియోజకవర్గ పరిధిలో మొత్తం 135 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో దాదాపు 48 పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. ఈ లెక్కన సుమారు 40 శాతం పంచాయతీల్లో పోలింగ్‌కు ముందే ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లయింది.మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఏకగ్రీవాలు నమోదు కావడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మిగిలిన పంచాయతీల్లో ఎన్నికల పోరు ఎలా సాగుతుందన్న ఆసక్తి నెలకొంది. అయితే ఏకగ్రీవాలపై తుది అధికారిక గణాంకాలు వెలువడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *