Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా యు.ఎస్.పి.సి యాదాద్రి జిల్లా కమిటీ విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్ పీసీ) నాయకులు కోరారు.
  • మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ఆవరణంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు విడుదల చేశారు.
  • ఈ సందర్భంగా యూఎస్బీసీ నాయకులు *ముక్కెర్ల యాదయ్య, జి లక్ష్మీనరసింహారెడ్డి, మెతుకు సైదులు, మైలారం సత్తయ్య* మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 1న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద…

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి

ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా

యు.ఎస్.పి.సి యాదాద్రి జిల్లా కమిటీ

విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న కలెక్టరేట్ వద్ద
నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట
కమిటీ(యూఎస్ పీసీ) నాయకులు కోరారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ఆవరణంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ
సందర్భంగా యూఎస్బీసీ నాయకులు *ముక్కెర్ల యాదయ్య, జి లక్ష్మీనరసింహారెడ్డి, మెతుకు సైదులు, మైలారం సత్తయ్య* మాట్లాడుతూ
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట
కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 1న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే
ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని,
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని, 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి, పీఆర్సీని
ప్రకటించి 1/7/2023 నుండి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని,
సీ పీఎస్ ను రద్దుచేసి, ఓపీఎస్ ను అమలు చేయాలని, 317 జీ ఓ వల్ల నష్టపోయిన
ఉపాధ్యాయులందరినీ వారివారి సొంత జిల్లాలకు పంపించాలని, ఉద్యోగ
విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే
చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25 ను సవరించాలని, సమగ్ర శిక్ష
ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలన్నారు. టైం
స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం
అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు
డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈఓ, నూతన
మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత
సర్వీసు రూల్స్ రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్ భాస్కర్, జీ వి రమణారావు, జె కరుణాకర్, జనార్ధన్, బాలయ్య, విజయ, టి. వెంకన్న కె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

*USPC యాదాద్రి జిల్లా కమిటీ*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *