వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం 24 8 2026 పున్నమి ప్రతినిధి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పేరుతో విడుదలైనట్లు కనిపిస్తున్న ఈ ప్రకటనలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తేదీలను పేర్కొన్నారు.
- వైరల్ అవుతున్న ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 7న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, సెప్టెంబర్ 20న అభ్యంతరాలు/క్లెయిమ్‌ల దాఖలు, సెప్టెంబర్ 23న వాటి పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు.
విశాఖపట్నం 24 8 2026 పున్నమి ప్రతినిధి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పేరుతో విడుదలైనట్లు కనిపిస్తున్న ఈ ప్రకటనలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తేదీలను పేర్కొన్నారు.
వైరల్ అవుతున్న ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 7న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, సెప్టెంబర్ 20న అభ్యంతరాలు/క్లెయిమ్‌ల దాఖలు, సెప్టెంబర్ 23న వాటి పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు.
అదేవిధంగా సెప్టెంబర్ 28న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, అక్టోబర్ 11న నామినేషన్ల దాఖలు, అక్టోబర్ 14న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ ఉంటుందని అందులో ఉంది.
అక్టోబర్ 28న పోలింగ్, అదే రోజున ఓట్ల లెక్కింపు, నవంబర్ 1న వార్డు సభ్యుల ఎన్నిక ఉంటుందని వైరల్ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన అధికారిక ధృవీకరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన ద్వారా నిర్ధారించాల్సి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఎన్నికల తేదీలను ఖరారైనవిగా భావించవద్దని ప్రజలకు సూచన.