Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల సమస్యలపై అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల సమస్యలపై అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం

వార్త ముఖ్యాంశాలు

  • మేడ్చల్: సెప్టెంబర్ 03 (పున్నమి ప్రతినిధి - సందీప్): మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అలియాబాద్, మూడుచింతలపల్లి మరియు ఎల్లంపేట మున్సిపాలిటీలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ ఫైజాన్ అహ్మద్ (IAS) గారిని అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలతో కలిసి వినతిపత్రం…
  • ఈ కార్యక్రమంలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు వంటి ప్రాథమిక వసతుల కల్పనపై అడిషనల్ కలెక్టర్‌కు వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
  • ​ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన ఉచిత పంపిణీ: ​'మీ సమస్య - మా పరిష్కారం' కార్యక్రమంలో భాగంగా మహిళా శక్తి మై వాయిస్ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన (PMSBY) పథకాన్ని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరికీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ఈ…

మేడ్చల్: సెప్టెంబర్ 03 (పున్నమి ప్రతినిధి – సందీప్):
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అలియాబాద్, మూడుచింతలపల్లి మరియు ఎల్లంపేట మున్సిపాలిటీలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ ఫైజాన్ అహ్మద్ (IAS) గారిని అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలతో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు వంటి ప్రాథమిక వసతుల కల్పనపై అడిషనల్ కలెక్టర్‌కు వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
​ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన ఉచిత పంపిణీ:
​’మీ సమస్య – మా పరిష్కారం’ కార్యక్రమంలో భాగంగా మహిళా శక్తి మై వాయిస్ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన (PMSBY) పథకాన్ని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరికీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
​పాల్గొన్న ప్రముఖులు:
​ఈ కార్యక్రమంలో మహిళా శక్తి మై వాయిస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మేడ్చల్ జిల్లా డి.ఎం.హెచ్.ఓ మెడికల్ అండ్ అడ్వైజరీ కమిటీ బోర్డ్ మెంబర్ ఎన్. హైమారెడ్డి, మహిళా శక్తి సంఘం ట్రెజరర్ రమేష్ అంబటి, బీజేపీ నాయకులు ఆంజనేయులు ముదిరాజ్, ఆర్తి, లత మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *